'పుష్ప' నుంచి మరో పవర్ఫుల్ పోస్టర్!
- అడవి నేపథ్యంలో సాగే కథ
- మాస్ ను ఊపేస్తున్న సాంగ్స్
- ఉత్కంఠను పెంచే ఫైట్స్
- డిసెంబర్ 17న భారీ రిలీజ్
అలాగే 'పుష్ప' సినిమాలోను ఆయన డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అసలు ఆయన లుక్ తోనే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను వదిలారు. అడవి నేపథ్యంలో ఎర్ర చందనం దుంగలపై 'గన్' పట్టుకుని కూర్చుని ఆయన కనిపిస్తున్నాడు.
అప్పటికే పోరాడి అలసిపోయిన ఆయన, ఇక తెగించి 'ఎవరొస్తారో రండిరా ..' అన్నట్టుగా చూస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పడానికి నిదర్శనంగా ఈ ఒక్క పోస్టర్ ను చూపించవచ్చు. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ పరంగా మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తోంది. ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది
.