నోయిడా ఎయిర్ పోర్టు... ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయానికి ప్రధాని మోదీ భూమిపూజ
- గ్రేటర్ నోయిడాలో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం
- రూ.10,050 కోట్లతో తొలిదశ పనులు
- 2024 నాటికి అందుబాటులోకి విమానాశ్రయం
- ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విమానాశ్రయం
దేశ రాజధాని ఢిల్లీకి చేరువలో ఉండే ఈ విమానాశ్రయం విస్తీర్ణం 1,300 హెక్టార్లు. రూ.10,050 కోట్లతో తొలి దశ పనులు చేపడుతున్నారు. మరో మూడేళ్లలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. కాగా, ఇది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విమానాశ్రయం అవుతుందని భావిస్తున్నారు.