రేషన్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త.. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం గడువు పొడిగింపు
- మరో నాలుగు నెలలపాటు పొడిగింపు
- ప్రతి ఒక్కరికీ అదనంగా ఐదు కిలోల చొప్పున బియ్యం
- దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి లబ్ధి
తాజా నిర్ణయంతో వచ్చే ఏడాది మార్చి వరకు ఈ పథకం అమల్లో ఉండనుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. అదనంగా ఇచ్చే బియ్యానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేంద్రమే భరిస్తోంది.