Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆలోచనలోపడిన 'శ్యామ్ సింగ రాయ్'

Shyam Singha Roy movie update
  • రాహుల్ సాంకృత్యన్ నుంచి 'శ్యామ్ సింగ రాయ్'
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న నాని
  • డిసెంబర్ 24వ తేదీన విడుదల
  • అదే రోజున థియేటర్లకు వస్తున్న 'గని'
నాని కథానాయకుడిగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను రూపొందించాడు. చారిత్రక నేపథ్యంలో కలకత్తాలో నడిచే కథ ఇది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా కోసం 10 ఎకరాల్లో ప్రత్యేకంగా సెట్ వేసి మేజర్ పార్టు షూటింగు అక్కడ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ అలరించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. సోలో రిలీజ్ డేట్ ను నాని భలే సెట్ చేసుకున్నాడేనని అనుకున్నారు.

కానీ ఇంతలో పోటీగా వరుణ్ తేజ్ సినిమా 'గని' దిగిపోయింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తరువాత 24వ తేదీకి వాయిదా వేసుకున్నారు. దాంతో 'శ్యామ్ సింగ రాయ్' ఆలోచనలో పడ్డాడని అంటున్నారు. మరి ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఏ స్థాయిలో నడుస్తుందో చూడాలి.
Nani
Sai Pallavi
Krithi Shetty
Madonna
Shyam Singha Roy Movie

More Telugu News