60 ఏళ్ల తర్వాత కర్నూలు జిల్లా లక్కసాగరం పంచాయతీకి ఎన్నికలు
- లక్కసాగరం పంచాయతీ ఆవిర్భావం నుంచి ఏకగ్రీవమే
- సర్పంచ్ పదవి కోసం తొలిసారి రెండు వర్గాల పోటీ
- 858 ఓట్ల తేడాతో విజయం సాధించిన వరలక్ష్మి
ఈ ఏడాది ఫిబ్రవరిలో లక్ష్మీదేవి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఆమె మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో గత సంప్రదాయానికి భిన్నంగా సర్పంచ్ పదవి కోసం రెండు వర్గాలు పోటీ పడ్డాయి. దీంతో నిన్న జరిగిన ఎన్నికలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి వర్గానికి చెందిన ఎం.వరలక్ష్మి 858 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.