Andhra Pradesh: ఏపీలో మరో 262 మందికి కరోనా పాజిటివ్

ఏపీలో గడచిన 24 గంటల్లో 33,362 కరోనా పరీక్షలు నిర్వహించగా, 262 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 46 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 38, గుంటూరు జిల్లాలో 33, కృష్ణా జిల్లాలో 31 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక కేసు నమోదైంది.

అదే సమయంలో 229 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,69,614 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,51,976 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,227 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,411కి పెరిగింది.
Andhra Pradesh
Corona Virus
Media Report
Today Cases

More Telugu News