దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

corona bulletin in inida
  • కొత్త‌గా 13,091 క‌రోనా కేసులు
  • నిన్న 340 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,62,189
  • నిన్న‌ 11,89,470 కరోనా ప‌రీక్ష‌లు  
దేశంలో కొత్త‌గా 13,091 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. క‌రోనా వ‌ల్ల‌ నిన్న 340 మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,62,189కు చేరింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,38,556 మంది చికిత్స తీసుకుంటున్నారు.

నిన్న క‌రోనా నుంచి 13,878 మంది కోలుకున్నారు. దీంతో క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,38,00,925 మంది కోలుకున్నట్టయింది. నిన్న దేశంలో 57,54,817 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మొత్తం వినియోగించిన డోసుల సంఖ్య 1,10,23,34,225కు చేరింది. నిన్న‌ 11,89,470 కరోనా ప‌రీక్ష‌లు చేశారు.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News