'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' పోరాటంలో అప్ప‌ట్లో ఏం జ‌రిగిందో చూడండి: ప‌వ‌న్ క‌ల్యాణ్

janasena pawan posts about steel plant
  • అమ‌ర‌వీరుల పేర్లు పోస్ట్ చేసిన ప‌వ‌న్
  • గాయ‌ప‌డ్డ వారి పేర్లు కూడా
  • అప్ప‌ట్లో ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న‌లు గుర్తు చేసిన జ‌న‌సేనాని
'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన అమర వీరుల పట్టిక' అంటూ వారి వివ‌రాల‌ను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోస్ట్ చేశారు. అలాగే, ఆ ఉద్యమంలో  గాయపడ్డ వారి పేర్ల‌ను కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఉద్య‌మ స‌మ‌యంలో ఏం జ‌రిగిందో వివ‌రిస్తూ అప్ప‌ట్లో ప‌లు వార్తా ప‌త్రిక‌లు ప్ర‌చురించిన క‌థ‌నాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ పోస్ట్ చేశారు.

పోలీసుల కాల్పులు, మృతులు, గాయ‌ప‌డ్డ వారి వివ‌రాల‌ను వాటిల్లో వివ‌రించారు. అలాగే, అప్ప‌టి ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న‌లను కూడా పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేటీక‌రించే ఆలోచ‌న‌ను విర‌మించుకోవాల‌ని ప్ర‌స్తుతం ప‌లువురు డిమాండ్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ ఉద్య‌మానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తు తెలిపారు.
Go Back to Shorts
Vizag Steel Plant
Vizag
Pawan Kalyan
Janasena

More Telugu News