వెస్టిండీస్ పై ఆసీస్ ఘనవిజయం... సెమీస్ అవకాశాలు పదిలం
- మొదట బ్యాటింగ్ చేసిన విండీస్
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 రన్స్
- 16.2 ఓవర్లలో ఛేజింగ్ చేసిన ఆసీస్
- వార్నర్ విధ్వంసక ఇన్నింగ్స్
- అర్ధసెంచరీతో రాణించిన మార్ష్
ఈ విజయంతో ఆస్ట్రేలియా తన నెట్ రన్ రేట్ ను మరింత మెరుగుపర్చుకోవడమే కాకుండా, సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. సూపర్-12 దశలో ఐదు మ్యాచ్ లు ఆడిన ఆసీస్ 4 విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉంది. ఆసీస్ సెమీస్ చేరాలంటే... ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితం వచ్చేవరకు ఆగాల్సి ఉంటుంది.
ప్రస్తుతం షార్జాలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. సూపర్-12 దశలో 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలతో కొనసాగుతున్న దక్షిణాఫ్రికాకు కూడా సెమీస్ అవకాశాలు ఉన్నాయి. అయితే నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓటమిపాలైనా, సాధారణ విజయం సాధించినా... మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా సెమీస్ లో అడుగుపెడుతుంది.