Chiranjeevi: 'ఆచార్య' సెకండ్ సింగిల్ కి ముహూర్తం ఫిక్స్!

Acharya second single will release in November 5th
షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందింది. చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటించగా, మరో జంటగా చరణ్ - పూజ హెగ్డే అలరించనున్నారు. చరణ్ - నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. గతంలో చిరూ - మణిశర్మ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి.

ఇక ఈ సినిమా ఫస్టు సింగిల్ గా వచ్చిన 'లాహే లాహే' సాంగ్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట జనంలోకి దూసుకుపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను వదలనున్నారు. చరణ్ - పూజ హెగ్డే లపై చిత్రీకరించిన 'నీలాంబరి' మెలోడీ గీతాన్ని ఈ నెల 5వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో సిద్ధా పాత్రలో చరణ్ .. 'నీలాంబరి' పాత్రలో పూజ కనిపించనున్నారు. నిజానికి ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనుకున్నారు .. కానీ కుదరలేదు. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సోనూ సూద్ .. జిషు సేన్ గుప్తా .. సౌరవ్ లోకేశ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు..
Go Back to Shorts
Chiranjeevi
Kajal Agarwal
Ramcharan
Pooja Hegde

More Telugu News