ఈ కలెక్టర్ సుప్రీంకోర్టు కంటే గొప్పవాడా?: రేవంత్ రెడ్డి
- విత్తనాలు, ఎరువుల డీలర్లతో సిద్ధిపేట కలెక్టర్ భేటీ
- యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలపై సమీక్ష
- వరి విత్తనాలు అమ్మొద్దంటూ హుకుం!
- సుప్రీంకోర్టు చెప్పినా షాపులు మూసేయిస్తానని హెచ్చరిక!
"వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ చేస్తామని సిద్ధిపేట కలెక్టర్ బెదిరిస్తున్నాడు. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా షాపులు తెరిచేందుకు ఒప్పుకోబోమని అంటున్నాడు. అధికారులను కూడా సస్పెండ్ చేస్తానని హెచ్చరిస్తున్నాడు. ఈ కలెక్టర్ సుప్రీంకోర్టును మించిన సుప్రీమా? తెలంగాణ సీఎం కార్యాలయం దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి" అంటూ రేవంత్ డిమాండ్ చేశారు.