ఫొటోలు ఉంటే కేటీఆర్ బయటపెట్టాలి: డీకే అరుణ
- రేవంత్, ఈటల రహస్యంగా భేటీ అయ్యారన్న కేటీఆర్
- ఏడాదిన్నర తర్వాత ఈటల కాంగ్రెస్ లో చేరుతారని వ్యాఖ్య
- బ్లాక్ మెయిల్ రాజకీయాలు టీఆర్ఎస్ కు అలవాటేనన్న అరుణ
ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు డీకే అరుణ అరుణ మాట్లాడుతూ, రేవంత్, ఈటల భేటీ ఫొటోలు ఉంటే బయటపెట్టాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం టీఆర్ఎస్ పార్టీకి అలవాటేనని అన్నారు. హుజూరాబాద్ లో ఓడిపోతామనే భయంతో కుట్రలకు పాల్పడుతోందని చెప్పారు. తనను సీఎం కాకుండా అడ్డుకున్నారనే కోపంతో ఈటలపై కేటీఆర్ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ లో గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు.