దుబాయ్‌లో మేడం టుసాడ్స్ మ్యూజియం.. కొలువుదీరిన విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం
- టీమిండియా వన్డే జెర్సీతో బ్యాట్ ఎత్తి నిల్చున్నట్టుగా కోహ్లీ విగ్రహం
- టీ20 ప్రపంచకప్ నేపథ్యంలోనే ఏర్పాటు
- ఢిల్లీ, లండన్, దుబాయ్ మ్యూజియాలు మూడింటిలోనూ కోహ్లీ మైనపు బొమ్మ
కోహ్లీతోపాటు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్ స్టార్లు రొనాల్డో, మెస్సి, ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ తదితరుల విగ్రహాలను కూడా ఈ మ్యూజియంలో ఇది వరకే ఏర్పాటు చేశారు. ఢిల్లీ, లండన్, దుబాయ్ మ్యూజియం మూడింటిలోనూ కోహ్లీ మైనపు బొమ్మలు కొలువుదీరడం గమనార్హం.