హైదరాబాదులో ముస్లిం మత పెద్దలతో వైఎస్ షర్మిల సమావేశం
- తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ
- హైదరాబాదు పాతబస్తీలో పర్యటించిన షర్మిల
- తలాబ్ కట్టలో పలువురు ముస్లిం మతపెద్దలను కలిసిన వైనం
- ఆపై బతుకమ్మ వేడుకలకు హాజరు
దేశంలోనే అతిపెద్ద ముస్లిం మతపెద్దల సంస్థ అయిన జమియతే ఉలేమాయే హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముఫ్తీ ఘయాస్ రహ్మానీ, ప్రధాన కార్యదర్శి ముఫ్తీ జుబేర్ ఖాస్మిలను కలిశారు. ఈ మర్యాద పూర్వక సమావేశంలో అన్ని జిల్లాల మతపెద్దలు కూడా పాల్గొన్నారు. కాగా, షర్మిల సద్దుల బతుకమ్మ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.