'దండుపాళ్యం' దారిలో 'తగ్గేదే లే'.. రేపు టీజర్ రిలీజ్!
- ప్రధాన పాత్రధారిగా నవీన్ చంద్ర
- దర్శకుడిగా శ్రీనివాసరాజు
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీనివాసరాజు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్ చూస్తే, 'దండుపాళ్యం' సినిమా గుర్తుకు వస్తుంది. అందుకు కారణం 'దండు పాళ్యం' 1 .. 2 ..3 సినిమాలను తెరకెక్కించిన దర్శకుడే ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
ఈ సారి ఈ సినిమాకి 'తగ్గేదే లే' అనే టైటిల్ ను సెట్ చేసుకున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. రేపు ఉదయం 10:08 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. నవీన్ చంద్ర .. రవిశంకర్ .. మకరంద్ దేశ్ పాండే .. పూజ గాంధీ ప్రధానమైన పాత్రలను పోషించారు.