'మహా' పాత్ర కోసం సమంతను అనుకున్నాను: అజయ్ భూపతి
- ఈ కథ ప్రేమకు అర్థం చెబుతుంది
- నిజమైన స్నేహానికి నిర్వచనం చెబుతుంది
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అవుతుంది
- తప్పకుండా పెద్ద హిట్ కొడుతుంది
తాజా ఇంటర్వ్యూలో అజయ్ భూపతి మాట్లాడుతూ .. " స్నేహం చేసినప్పుడు అవతలవారు ఒక్కోసారి తప్పు చేసినా స్వీకరించగలగాలి. ప్రేమలో ఎదురయ్యే పరిణామాలను అంతేలా స్వీకరించగలగాలి అనేదే ఈ కథ. రావు రమేశ్ - జగపతిబాబు పాత్రలు ఈ సినిమాకి మరింత బలంగా నిలుస్తాయి.
ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర 'మహా'. ఈ పాత్రను గురించి రాస్తున్నప్పుడే సమంతను అనుకున్నాను. కానీ కుదరలేదు. అందువలన అదితీరావును తీసుకున్నాను. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమా ఈ పండగకి తప్పకుండా పెద్ద హిట్ కొడుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.