వేర్వేరుగా మీడియా ముందుకు రానున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు.. ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ!
- మా ఎన్నికల్లో గెలిచిన విష్ణు
- ఓటమికి గల కారణాలు చెప్పనున్న ప్రకాశ్ రాజ్
- ప్రకాశ్ రాజ్ మాట్లాడిన తర్వాత మంచు విష్ణు మీడియా సమావేశం
మరోవైపు, ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడిన తర్వాత మంచు విష్ణు కూడా మాట్లాడనున్నాడు. ఈ మేరకు ఈ రోజు ఉదయం ట్వీట్ చేశాడు. మరిన్ని పోస్టులకు సంబంధించిన కౌంటింగ్ ఉందని చెప్పాడు. ఆ తర్వాత ఈ ఎన్నికల గురించి మాట్లాడతానని తెలిపాడు. సినిమా కుటుంబం తనపై చూపిన ప్రేమ, మద్దతుకు ఆయన కృతజ్ఞతలు చెప్పాడు. ఈసీ మెంబర్స్, జాయింట్ సెక్రటరీ, ఒక ఉపాధ్యక్షుడి పోస్ట్‌కు సంబంధించిన కౌంటింగ్ ఈరోజు ఉదయం 11గంటలకు ప్రారంభం కానుందని తెలిపాడు.