కరోనామాత ఆలయ కూల్చివేతను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన వ్యక్తులపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రూ. 5 వేల చొప్పున జరిమానా
- జూన్ 7న యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఆలయ నిర్మాణం
- వివాదాస్పద స్థలంలో నిర్మించారంటూ 11న కూల్చివేత
- కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ పిటిషనర్లపై ఆగ్రహం
విచారణ సందర్భంగా ఆలయం నిర్మించిన స్థలం లోకేశ్‌ది మాత్రమే కాదని, వివాదాస్పదమైన ఆ స్థలం ముగ్గురి ఉమ్మడి ఆస్తి అని తేలింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం ధర్మాసనం.. వివాదాస్పద స్థలంలో ఆలయాన్ని నిర్మించడమే కాకుండా కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు గాను రూ. 5 వేల చొప్పున జరిమానా విధించింది. నాలుగు వారాల్లోగా ఆ సొమ్మును సుప్రీంకోర్టు న్యాయవాదుల సంక్షేమ నిధికి జమచేయాలని ఆదేశించింది.