Pawan Kalyan: ఈ మౌలిక సూత్రాన్ని ఎలా మ‌రిచారు?: వైసీపీ ప్ర‌భుత్వంపై మ‌రోసారి మండిప‌డ్డ ప‌వ‌న్ క‌ల్యాణ్‌

pawan slams ycp
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ తీరుపై జ‌న‌సేన అధినే‌త ప‌వ‌న్ క‌ల్యాణ్ మరోసారి మండిప‌డ్డారు. 'తాక‌ట్టులో ఆంధ్ర‌ప్ర‌దేశ్' పేరుతో ఆయ‌న ప‌లు వివ‌రాలు పోస్ట్ చేశారు. 'ఎన్ని వాగ్దానాలు చేసినా.. ఎన్ని అరుపులు అరిచినా .. రాష్ట్ర బడ్జెట్టుని ఎంత  మసి పూసి మారేడుకాయ చేసినా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు. పండించిన దానికన్నా  ఎక్కువ పంచలేరు.. ఈ మౌలిక ఆర్థిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచినట్టుంది' అని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.

వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో ఏపీలో ఆర్థికాభివృద్ధి లేద‌ని, న‌వ‌ర‌త్నాల పేరిట మాత్రం వ‌రాలు కురిపిస్తున్నామ‌ని చెప్పుకుంటోంద‌ని ప‌వ‌న్ ఓ గ్రాఫ్ ద్వారా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. రాబ‌డి లేక ప్ర‌భుత్వం అప్పులు చేస్తోంద‌ని, నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల‌న్నింటినీ పెంచుతోంద‌ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Andhra Pradesh

More Telugu News