దేశంలో కొత్త‌గా 18,833 క‌రోనా కేసుల నమోదు

India reports 18833 new cases in the last 24 hours
  • మొత్తం కేసుల సంఖ్య‌ 3,38,71,881
  • నిన్న క‌రోనాతో 278 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,49,538
  • 203 రోజుల క‌నిష్ఠానికి యాక్టివ్ కేసులు
దేశంలో కొత్త‌గా 18,833 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య‌ 3,38,71,881కు చేరింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,46,687 మంది చికిత్స తీసుకుంటున్నారు. యాక్టివ్ కేసులు 203 రోజుల క‌నిష్ఠానికి చేరాయి.

ఇక క‌రోనా నుంచి కొత్త‌గా 24,770 మంది కోలుకున్నారు. నిన్న క‌రోనాతో 278 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య‌ 4,49,538కి చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 92,17,65,405 డోసుల వ్యాక్సిన్లు వేశారు.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News