Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దసరా సెలవుల తర్వాత హైస్కూల్‌లో విలీనం కానున్న 3 నుంచి 5 తరగతులు

primary school students from 3 to 5 in ap will be merge in high school
షార్ట్స్‌లో చూడండి
దసరా పండుగ తర్వాత ఏపీలోని వేలాది ప్రాథమిక పాఠశాలల నుంచి 3 నుంచి 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. 250 మీటర్లలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. నిజానికి ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే దీనిని అమలు చేయాలని అధికారులు భావించారు. అయితే, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను ఇప్పటి వరకు పరిశీలించడంతో సాధ్యం కాలేదు.

ఈ నేపథ్యంలో  దసరా సెలవుల తర్వాత రాష్ట్రంలోని 3,627 ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను 3,178 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయించారు. అయితే, ఉన్నత పాఠశాలల్లో భవనాల కొరత ఉన్న చోట మాత్రం ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులను అక్కడే ఉంచి సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధించాలని  నిర్ణయించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Primary School
High School
Students

More Telugu News