అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగించిన భారత్

India extends ban on international flights
  • సెప్టెంబరు 30 వరకూ అమల్లో ఉన్న నిషేధం
  • అక్టోబరు 31 వరకూ పొడిగిస్తూ డీజీసీఏ నిర్ణయం
  • అనుమతి పొందిన విమానాలపై వర్తించదని ప్రకటన
కరోనా కారణంగా భారతదేశంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీన్ని ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ కొన్నిరోజుల క్రితం డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరోసారి ఈ నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. అంతర్జాతీయ విమానాలపై బ్యాన్‌ను అక్టోబరు 31 వరకూ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

వీటిని అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలకు, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌కు, అన్ని ఎయిర్‌పోర్టులకు, ఇమిగ్రేషన్ బ్యూరో కమిషనర్‌కు పంపింది. ఈ నిషేధం కార్గో విమానాలపై వర్తించదని డీజీసీఏ తెలిపింది. అలాగే డీజీసీఏ అనుమతి పొందిన విమానాలపై కూడా ఈ నిషేధం ప్రభావం ఉండబోదని వెల్లడించింది.

కాగా, కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ఈ ఏడాది అంతర్జాతీయ విమానాలపై డీజీసీఏ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డెల్టా వేరియంట్ కారణంగా ఇతర దేశాలు కూడా భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఇప్పుడిప్పుడే భారత్ నుంచి వచ్చే విమానాలపై కొన్ని దేశాలు నిషేధాన్ని తొలగిస్తున్నాయి.
Go Back to Shorts
DGCA
Internatioan Flights

More Telugu News