తెలంగాణపైనా ‘గులాబ్’ తుపాను ప్రభావం.. నేడు, రేపు అతి భారీ వర్షాలకు అవకాశం!
- నేటి సాయంత్రం గోపాల్‌పూర్-కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం
- గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు
- కళింగపట్నానికి ఈశాన్యంగా 440 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ప్రాంతాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ, విదర్భ, చత్తీస్‌గఢ్, ఒడిశాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.