డ్రగ్స్ కేసులో కెల్విన్ వాంగ్మూలం నమ్మశక్యంగా లేదు: ఎక్పైజ్ శాఖ
- సినీ తారలకు డ్రగ్స్ విక్రయించినట్టు కెల్విన్ వెల్లడి
- ఆ మేరకు వాంగ్మూలం
- ఇటీవల ఎఫ్ఎస్ఎల్ నివేదిక
- పూరీ జగన్నాథ్, తరుణ్ లకు క్లీన్ చిట్
ఈ నేపథ్యంలో, ఎక్సైజ్ శాఖ కెల్విన్ వాంగ్మూలం నమ్మశక్యంగా లేదని పేర్కొంది. కెల్విన్ చెప్పిన విషయాలను ఆధారాలుగా భావించలేమని వివరించింది. పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవన్నది ఎఫ్ఎస్ఎల్ నివేదికతో స్పష్టమైందని వెల్లడించింది. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. సెలబ్రిటీలు, అనుమానితుల వద్ద డ్రగ్స్ లభించలేదని తెలిపింది.