గుజరాత్‌లో రూ. 9 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. విజయవాడతో ముఠాకు సంబంధాలు!
- ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఏపీలోని విజయవాడకు వెళ్తున్నట్టు గుర్తింపు
- గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో కంటెయినర్ల స్వాధీనం
- టాల్కమ్ పౌడర్ మాటున హెరాయిన్
ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ కేంద్రంగా పనిచేస్తున్న హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థ నుంచి టాల్కమ్ పౌడర్ మాటున వచ్చిన ఈ డ్రగ్స్.. విజయవాడ కేంద్రంగా పనిచేసే ఆషీ ట్రేడింగ్ సంస్థకు వెళ్తున్నట్టు గుర్తించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సంస్థ వ్యాపార లావాదేవీలు, ఇప్పటి వరకు ఎన్ని కన్‌సైన్‌మెంట్లు ఏయే దేశాల నుంచి వచ్చాయి అన్న వివరాలను సేకరిస్తున్నారు. కాగా, ఆషీ ట్రేడింగ్ కంపెనీ మూలాలు కాకినాడ, విజయవాడ, చెన్నై వరకు విస్తరించినట్టు తెలుస్తోంది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.