చత్తీస్‌గఢ్ మాజీ మంత్రి రాజీందర్ పాల్‌సింగ్ ఆత్మహత్య
- ఈ ఏడాది మార్చిలో కరోనా
- కోలుకున్న అనంతరం చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు
- ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య
అయితే, ఆ తర్వాతి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాజ్‌నంద్‌గావ్ జిల్లా చురియా పట్టణంలో తన నివాసంలో భాటియా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే, ఆయన నివాసం నుంచి సూసైడ్ నోట్ లభించిందా? లేదా? అన్న విషయాన్ని పోలీసులు నిర్ధారించలేదు. రాజీందర్ భార్య కొన్నేళ్ల క్రితమే చనిపోగా, ఆయన కుమారుడు జగ్జీత్సింగ్ భాటియా రాయ్‌పూర్‌లో ఓ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు.