Andhra Pradesh: ఏపీలో మరో 1,337 మందికి కరోనా పాజిటివ్

AP Covid Daily Cases bulletin
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 68,568 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,337 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 231 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 198, ప్రకాశం జిల్లాలో 161, కృష్ణా జిల్లాలో 144, గుంటూరు జిల్లాలో 141, నెల్లూరు జిల్లాలో 139, పశ్చిమ గోదావరి జిల్లాలో 128 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 1,282 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,38,690 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,09,921 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 14,699గా ఉంది. కరోనా మృతుల సంఖ్య 14,070కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Daily Cases
Deaths
Today Cases

More Telugu News