ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ ఈ నెలాఖరు వరకు పొడిగింపు
- రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ
- సెప్టెంబరు 30 వరకు పొడిగించిన ప్రభుత్వం
- ఉత్తర్వులు జారీ
- ఏపీలో ఇప్పటికీ 1000కి పైగా రోజువారీ కేసులు
ఏపీలో ఇప్పటికీ వెయ్యికి పైగానే రోజువారీ కరోనా కేసులు వస్తున్నాయి. అందువల్లే ప్రభుత్వం కర్ఫ్యూ కొనసాగింపు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో రోజువారీ కేసులు 500కి దిగువనే నమోదవుతుండగా, ఏపీలో మాత్రం 1000 దాటుతున్నాయి.