ఆఫ్ఘన్ సంక్షోభం: బైడెన్‌పై విమర్శలను తప్పుబట్టిన పాక్ ప్రధాని
- అమెరికా ప్రధానికి మద్దతుగా నిలిచిన ఇమ్రాన్ ఖాన్
- బైడెన్ తీసుకున్నది సున్నితమైన నిర్ణయం
- బైడెన్‌పై విమర్శలు అన్యాయమన్న ఇమ్రాన్
‘‘బైడెన్ తీసుకున్నది అత్యంత సున్నితమైన నిర్ణయం. ఈ విషయంలో ఆయనపై చాలా అన్యాయమైన విమర్శలు వచ్చాయి’’ అని పాక్ ప్రధాని చెప్పారు. కాగా, ఇటీవల ఆఫ్ఘన్ యుద్ధం గురించి ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన 20 ఏళ్లలో పాకిస్థాన్‌ను అమెరికా వాడుకుందని విమర్శించారు. ‘20 ఏళ్ల ఆఫ్ఘన్ యుద్ధంలో అమెరికా తమను ఒక కిల్లర్ (హైర్డ్ గన్)లా వాడుకుంది’ అని పేర్కొన్నారు.