పెళ్లయ్యాక భార్య కాళ్లు మొక్కిన భర్త.. నెటిజన్లు ఫిదా
- భార్య తన కాళ్లకు నమస్కారం పెట్టడంతో
- భర్త కూడా ఆమె కాళ్లు తాకిన వైనం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లందరూ ఆ వరుడు చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు. అతన్ని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ వధూవరులిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను ‘లవ్ మ్యారేజ్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.