"అబ్బా జాన్" అంటూ ఓ వర్గం వారిపై యూపీ సీఎం పరోక్ష వ్యాఖ్యలు... మండిపడుతున్న విపక్షాలు
- లక్నోలో నిన్న కార్యక్రమం
- పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్
- ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు
- విద్వేషం వెళ్లగక్కందే ఎన్నికలకు వెళ్లలేరా అంటూ ఒమర్ వ్యాఖ్యలు
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం యోగిపై నేషనల్ కాన్ఫరెన్స్, బీఎస్పీ, సమాజ్ వాదీ తదితర రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, ముస్లింలపై విద్వేషం వెళ్లగక్కకుండా బీజేపీ ఏ ఎన్నికలకు వెళ్లదా? అని ప్రశ్నించారు. వాస్తవ పరిస్థితి చూస్తే అలాగే ఉందని విమర్శించారు. హిందువుల రేషన్ ను ముస్లింలు తింటున్నారని ఓ సీఎం చెప్పడం, ఆయనే స్వయంగా ఓట్లు అడగడం ఈ వీడియోలో చూడండి అని పేర్కొన్నారు. ఈ మేరకు యూపీ సీఎం మాట్లాడిన మాటల తాలూకు వీడియోను ఒమర్ పంచుకున్నారు.