శరణార్థులను విదేశాలకు తరలించేందుకు సిద్ధం చేసిన ఆరు విమానాలను అడ్డుకున్న తాలిబన్లు
- ఆరు విమానాలను అడ్డుకున్న తాలిబన్లు
- 1000 మంది కొన్ని రోజులపాటు విమానాశ్రయంలో పడిగాపులు
- ప్రభుత్వ ఏర్పాటు వేడుకకు రావాలన్న తాలిబన్ల ఆహ్వానంపై చైనా మౌనం
అయితే, ఆ విమానాలు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకున్నారని అధికారి ఒకరు తెలిపారు. దీంతో దాదాపు 1000 మంది కొన్ని రోజులు విమానాశ్రయంలోనే గడిపిన అనంతరం మరో మార్గం లేక వారంతా వెనక్కి వెళ్లిపోయారని పేర్కొన్నారు. శరణార్థుల విమానాలకు ఇంకా అనుమతి రాలేదని కూడా ఆయన వివరించారు.
ఇదిలావుంచితే, నూతన ప్రభుత్వ ఏర్పాటుకు హాజరు కావాల్సిందిగా తాలిబన్ల నుంచి వచ్చిన ఆహ్వానంపై చైనా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ విషయమై అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ స్పందిస్తూ.. ఈ విషయంపై తన వద్ద ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదని బదులిచ్చారు.