టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. కృష్ణా నాగర్ సంచలనం
- భారత్‌కు నేడు వరుసగా రెండో పతకం
- 19 పతకాలతో 24వ స్థానంలో భారత్
- హాంకాంగ్ షట్లర్‌ను చిత్తు చేసిన కృష్ణా నాగర్
బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణ పతకం కావడం గమనార్హం. నిన్న స్టార్ షట్లర్ ప్రమోద్ భగత్ పారా-బ్యాడ్మింటన్‌లో తొలి పతకం అందించాడు. తాజా పతకంతో కలిపి భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 19కు పెరిగింది. వీటిలో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం 24వ స్థానంలో ఉంది.