'బిచ్చగాడు 2'కి హీరోనే సంగీత దర్శకుడు!
- 'బిచ్చగాడు'తో హీరోగా గుర్తింపు
- రీసెంట్ గా మొదలైన సీక్వెల్
- దర్శకుడిగా ప్రియా కృష్ణస్వామి
- తన సినిమాకి తనే సంగీత దర్శకుడు
ఈ నేపథ్యంలో ఆయన నటించిన 'బిచ్చగాడు' సినిమా తమిళంతో పాటు తెలుగులోను భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఆయన హీరోగానే వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఈ క్రమంలో 'బిచ్చగాడు' స్థాయిలో ఏ సినిమా హిట్ కాకున్నా తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు.
ఆయన తాజా చిత్రంగా 'బిచ్చగాడు 2' రూపొందుతోంది. ఈ సినిమాను ఆయన నిర్మించడమే కాకుండా, సంగీతాన్ని అందించాలని నిర్ణయించుకున్నాడట. 'బిచ్చగాడు' స్థాయిలో ఈ సినిమా విజయవంతం కావాలనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. మొదటిభాగాన్ని శశి తెరకెక్కించగా, ఈ సినిమాకి ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు.