మూడు డిఫరెంట్ లుక్స్ తో చైతూ!

Chatu Thank You movie update
నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఆ మధ్య ఇటలీ వెళ్లి కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా చిత్రీకరించుకుని వచ్చారు. అక్కడి అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని కూడా చెప్పారు.

ఈ సినిమాలో చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో చైతూ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నట్టు చెబుతున్నారు. అంటే వయసు పరంగా ఆయన మూడు దశలలో కనిపిస్తాడని చెబుతున్నారు. గతంలో ఈ తరహా పాత్రలను ఆయన 'ప్రేమమ్' సినిమాలో పోషించాడు.

మరి ఆ పాత్రలకు .. ఈ పాత్రలకు మధ్య వైవిధ్యం ఏమిటనేది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక చైతూ తాజా చిత్రంగా త్వరలో 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా 'బంగార్రాజు' సినిమా షూటింగులోను ఆయన జాయినైన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Nagachaitanya
Rasi Khanna

More Telugu News