'ప్రేమ్ కుమార్' నుంచి గ్లింప్స్ రిలీజ్!
- 'ప్రేమ్ కుమార్'గా సంతోష్ శోభన్
- అభిషేక్ మహర్షి దర్శకత్వం
- కథానాయికగా రాశి సింగ్
- పెళ్లి చుట్టూ తిరిగే కథ
అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్టులుక్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. మంగళ సూత్రాలు రెడీగా పట్టుకుని, తనకి తగిన వధువు కోసం భూతద్దం పట్టుకుని గాలించే పెళ్లి కొడుకు లుక్ తో సంతోష్ శోభన్ అందరిచూపు ఈ సినిమా వైపుకు తిప్పేశాడు.
తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను వదిలారు. తన మనసుకు నచ్చే అమ్మాయి కోసం పెళ్లికొడుకుగా హీరో పడే పాట్లను కామెడీగా చూపించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా కూడా చెప్పేశారు. ఈ సినిమాలో కథానాయికగా రాశి సింగ్ సందడి చేయనుంది.