బీసీసీఐకి కాసుల వర్షం: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లకు బిడ్లు.. రూ. 5 వేల కోట్లకు పైగా ఆదాయం!
- వచ్చే సీజన్‌లో 10కి పెరగనున్న జట్ల సంఖ్య
- వార్షికాదాయం రూ. 3 వేలు కోట్లు ఉంటేనే బిడ్డింగ్‌కు అవకాశం
- ఒక్కో జట్టు బేస్ ప్రైస్ రూ. 2 వేల కోట్లగా నిర్ణయం
10 లక్షల రూపాయలు చెల్లించి ఏ కంపెనీ అయినా బిడ్ పత్రాలను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, కనీసం రూ. 3000 కోట్లు ఉన్న కంపెనీలు మాత్రమే బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇస్తామని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, కన్సార్షియంగా అంటే మూడు కంపెనీలు ఒక సంస్థగా ఏర్పడి కూడా బిడ్డింగ్‌లో పాల్గొనొచ్చు. మూడు కంటే ఎక్కువ కంపెనీలు మాత్రం ఒకటిగా ఏర్పడేందుకు అనుమతించే అవకాశం లేదు.
కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నో, పూణెల నుంచి వచ్చే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం, లక్నోలోని ఎకానా స్టేడియాల సామర్థ్యం ఎక్కువ కాబట్టి ఫ్రాంచైజీలు అటువైపే మొగ్గు చూసే అవకాశం ఉందని సమాచారం. అలాగే, అదానీ గ్రూప్, ఆర్‌పీజీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌తోపాటు ఫార్మా కంపెనీ టోరెంట్, ప్రముఖ బ్యాంకర్ కొత్త ఫ్రాంచైజీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.