ఆ 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
- నోయిడాలో ట్విన్ టవర్లను నిర్మించిన సూపర్ టెక్ సంస్థ
- నిబంధనలు పాటించలేదన్న సుప్రీంకోర్టు
- మూడు నెలల్లో నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశం
ఈ టవర్ల నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. మూడు నెలల్లోగా కూల్చివేతలను పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ టవర్లను సూపర్ టెక్ సంస్థ నిర్మించింది. కూల్చివేతలకు అయ్యే ఖర్చును కూడా సూపర్ టెక్ సంస్థ నుంచే వసూలు చేయాలని ఆదేశించింది. ఇందులో ప్లాట్లు కొన్నవారికి 12 శాతం వడ్డీతో నగదును తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణంలో ప్రమాణాలను పాటించలేదని, నిబంధనలను కూడా ఉల్లంఘించారని కోర్టు తెలిపింది. రెండు టవర్ల మధ్య ఉండాల్సిన గ్యాప్ లేదని చెప్పింది. టవర్లలో నివసించే వారి రక్షణ తమకు ముఖ్యమని స్పష్టం చేసింది.