వర్చువల్ విధానంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న తానా
- రెండ్రోజుల పాటు వేడుకలు
- ఈ నెల 28, 29 తేదీల్లో వేడుకల నిర్వహణ
- సన్నద్ధమవుతున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక
- గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని వేడుకలు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమ బెంగాల్ మంత్రి డాక్టర్ శశి పిల్లలమర్రి (తెలుగు సంతతి వ్యక్తి) హాజరుకానున్నారు. ప్రత్యేక అతిథిగా పశ్చిమ బెంగాల్ డీజీపీ బొప్పూడి నాగరమేశ్, అతిథిగా టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి హాజరుకానున్నారు. ఈ మేరకు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి వివరాలు తెలిపారు.