కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాకు సిక్కు యాత్రికులను అనుమతించాలని పాక్ నిర్ణయం
- వచ్చే నెల 22న గురునానక్ వర్ధంతి
- కర్తార్ పూర్ గురుద్వారా తెరవనున్న పాక్
- పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం
- భక్తులకు ఆంక్షలతో అనుమతి
ప్రస్తుతం పాక్ లో అడుగుపెట్టేవారు వ్యాక్సిన్ రెండు డోసులు పొంది ఉండాలని, ఆర్టీ-పీసీఆర్ టెస్టు ఫలితాలు కూడా సమర్పించాలని అక్కడి ప్రభుత్వం నిబంధనలు విధించింది. పాకిస్థాన్ కరోనా ప్రభావిత దేశాలను మూడు కేటగిరీలుగా విభజించింది. సి కేటగిరీలో ఉన్న దేశాల నుంచి వచ్చేవారిపై పాక్ కఠిన ఆంక్షలు విధిస్తోంది. వారిని ఎన్సీఓసీ మార్గదర్శకాలకు లోబడి అనుమతిస్తారు. డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువ రావడంతో మే 22 నుంచి ఆగస్టు 12 వరకు భారత్ ను పాకిస్థాన్ సి కేటగిరీలో ఉంచింది.