దిశ చట్టం, దిశ యాప్ పేరుతో ప్రచారం చేసుకోకండి... పబ్లిసిటీయే సిగ్గుపడుతుంది: నారా లోకేశ్
- విజయనగరం జిల్లాలో ఘటన
- యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
- తీవ్రంగా స్పందించిన లోకేశ్
- మూడు రోజుల్లో మూడు ఘటనలు అంటూ ఆగ్రహం
"జగన్ గారూ... మీ ఇంట్లో మహిళలకు రక్షణ లేదు, మీ ఇంటి పక్కన నివసించేవారు కూడా అత్యాచారానికి గురయ్యారు. మీ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రత లేకుండా పోయింది. ప్రజలు భయంభయంగా బతుకుతున్నారు. ఇంకా లేని దిశ చట్టం, రక్షించలేని దిశ యాప్ పేరుతో ప్రచారం చేసుకోకండి... పబ్లిసిటీయే సిగ్గుపడుతుంది. నిందితుల్ని పట్టుకుని శిక్షించడంలో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తే రోజుకొకడు ఈ విధంగా మృగంలా ప్రవర్తించడు" అని హితవు పలికారు.
"బాధితులను బాధిస్తూ, నిందితులను రక్షించే ప్రభుత్వం అని స్పష్టం కావడంతో నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇలాంటి ఘటనలపై దయచేసి దృష్టి సారించండి. ఆడపిల్లల ఉసురు తగిలితే మీకూ, ఈ రాష్ట్రానికి మంచిది కాదు" అని స్పష్టం చేశారు.