కాబూల్ లో సిక్కు గురుద్వారాను సందర్శించిన తాలిబన్లు
- ఆఫ్ఘన్ లో అధికారం చేపట్టిన తాలిబన్లు
- సిక్కులు, హిందువుల్లో తీవ్ర ఆందోళన
- ఓ గురుద్వారాలో తలదాచుకుంటున్న 200 మంది సిక్కులు
- ఎలాంటి హాని తలపెట్టబోమన్న తాలిబన్లు
ఢిల్లీలోని సిఖ్ గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సిర్సా దీనిపై స్పందిస్తూ, ఆఫ్ఘన్ లోని గురుద్వారా వర్గాలతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, తాలిబన్ నేతలు వారి భద్రతకు హామీ ఇచ్చినట్టు తెలిసిందని వెల్లడించారు. కాగా, కాబూల్ గురుద్వారాలో 200 మంది సిక్కులు చిక్కుకుపోయారన్న వార్తల నేపథ్యంలో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వారి పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే.