Corona Virus: దేశంలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

 India reports 32937 fresh cases
షార్ట్స్‌లో చూడండి
భార‌త్‌లో నిన్న 32,937 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,25,513కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 35,909 మంది కోలుకున్నారు.
 
ఇక మరణాల విషయానికొస్తే... నిన్న 417 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,31,642 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,14,11,924 మంది కోలుకున్నారు. 3,81,947 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 54,58,57,108 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు. నిన్న 11,81,212 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News