శ్రీను వైట్లకి మాట ఇచ్చిన రవితేజ?

Raviteja in Srinu Vaitla movie
  • ఒకప్పుడు వరుస హిట్లు ఇచ్చిన శ్రీను వైట్ల
  • కొంతకాలంగా దూరమైన విజయాలు
  • తగ్గిపోయిన అవకాశాలు
  • మంచి కథతో వస్తే డేట్లు ఇస్తానన్న రవితేజ
టాలీవుడ్ అగ్రదర్శకుల జాబితాలో శ్రీను వైట్ల చాలా వేగంగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. స్టార్ హీరోలతో భారీ సినిమాలు .. భారీ విజయాలతో ఆయన కెరియర్ కొనసాగింది. అయితే కొంతకాలంగా సక్సెస్ అనేది ఆయనకు అందుబాటులోకి రావడం లేదు. దాంతో సహజంగానే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

ప్రస్తుతం ఆయన చేతిలో మంచు విష్ణు 'డి అండ్ డి' తప్ప మరో ప్రాజెక్టు లేదు. ఈ సినిమా ఎప్పుడు మొదలుకానుందనే విషయంలో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో తనకి బ్రేక్ ఇచ్చిన శ్రీను వైట్ల గురించి రవితేజ ఆలోచన చేశాడట. మంచి కథ .. నిర్మాతను చూసుకుంటే తాను డేట్స్ ఇస్తానని మాట ఇచ్చినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.

నీ కోసం .. వెంకీ .. దుబాయ్ శీను వంటి హిట్లు ఇచ్చిన శ్రీను వైట్లకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేశాడు. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది. అయినా మరోసారి ఛాన్స్ ఇవ్వడానికి రవితేజ సిద్ధపడటం విశేషం. మరి ఈ అవకాశాన్ని శ్రీను వైట్ల ఎంతవరకూ ఉపయోగించుకుంటాడో చూడాలి.  
Go Back to Shorts
Raviteja
Srinu Vaitla
Tollywood

More Telugu News