అమరావతిలో గ్రావెల్ తవ్వకాల అంశంపై ఆరా తీసిన ఎస్పీ విశాల్ గున్నీ
- రాజధానిలో అక్రమ తవ్వకాల కలకలం
- సీఐ అనుమతిచ్చారంటూ ఆరోపణలు
- ఓ ఆడియో వైరల్
- అందులో గొంతు తనది కాదంటున్న సీఐ
- విచారణకు ఆదేశించిన ఎస్పీ
గ్రావెల్ తవ్వకాలకు అనుమతిస్తూ తుళ్లూరు సీఐ దుర్గాప్రసాద్ ఆ ఆడియోలో మాట్లాడినట్టు ఆరోపణలు రావడం తెలిసిందే. దాంతో, రాజధానిలో అక్రమ తవ్వకాలు అడ్డుకోవాలంటూ రైతులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. కంకర కోసం ఏకంగా రోడ్లను తవ్వేస్తూ కంకర మాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, సీఐ దుర్గాప్రసాద్ తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు.
రైతులు చెబుతున్నట్టుగా ఆ ఆడియోలో గొంతు తనది కాదని స్పష్టం చేశారు. అక్రమ తవ్వకాలు చేపడుతున్న వారిపై కేసులు నమోదు చేశామని, విచారణ జరుగుతుందని తెలిపారు. అయితే, రైతులు ఆయనిచ్చిన వివరణకు సంతృప్తి చెందలేదు. పోలీసులపై తమకు నమ్మకంలేదని స్పష్టం చేశారు.