వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం ముగిసిన ఇవాళ్టి అన్వేషణ
- వివేకా హత్య కేసులో సునీల్ అరెస్ట్
- సునీల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు
- ఆయుధాల కోసం వాగులో అన్వేషణ
- దక్కని ఫలితం
- రేపు కూడా అన్వేషణ
వాగులో మురికినీరు ఉండడంతో, 2 ట్యాంకర్లు, 20 మంది మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు. యంత్రాలతో మట్టిని తొలగించి గాలించినా ఆయుధాల జాడ దొరకలేదు. కాగా, మున్సిపల్ సిబ్బంది రోటరీపురం వాగును సర్వే చేస్తున్నారు. సునీల్ చెప్పిన సమాచారంపై అనుమానంతో సర్వే సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రేపు కూడా వాగులో ఆయుధాల కోసం అన్వేషణ కొనసాగించాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.