దేవినేని ఉమ వాహనంలో వెళుతుండగా ద్విచక్రవాహనంపై మహిళా అభిమాని విన్యాసాలు... వీడియో ఇదిగో!
- జైలు నుంచి విడుదలైన దేవినేని ఉమ
- వాహనంలో వెళుతుండగా వింత అనుభవం
- స్కూటర్ పై సాహసాలు చేసిన మహిళ
- జాగ్రత్త అంటూ వారించిన ఉమ
వాహనంలో ఉమ ప్రయాణిస్తుండగా, పక్కనే పసుపు రంగు స్కూటర్ పై ఆ మహిళ వేగంగా దూసుకెళ్లింది. నడుస్తున్న స్కూటీపై పైకి లేచి నిలబడడమే కాకుండా, ఒంటి చేత్తో నియంత్రిస్తూ తన అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేసింది. దాంతో, ఆమె సాహసకృత్యాల పట్ల వాహనంలో ఉన్న ఉమ కంగారు పడ్డారు. జాగ్రత్త అమ్మా అంటూ ఆ మహిళా అభిమానిని వారించే ప్రయత్నం చేశారు.