జల ప్రవాహం ధాటికి ప్రాజెక్టు గేటు విరిగిపోవడం, యాంకర్ తెగిపోవడం చూస్తుంటే భయాందోళనలు నెలకొన్నాయి: జనసేన
- పులిచింతల డ్యామ్ 16వ నంబర్ గేటు విరిగిపోవడం దురదృష్టకరం
- ప్రాజెక్ట్ ఎంత సురక్షితంగా ఉందో గేట్ల నాణ్యతను బట్టే తెలుస్తుంది
- ఈ ప్రాజెక్టు లోపభూయిష్టంగా ఉంది
- నిపుణులు తొలి నుంచి చెబుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
ఈ ప్రాజెక్టు లోపభూయిష్టంగా ఉందని జల వనరుల ఇంజనీరింగ్ నిపుణులు మొదటి నుంచీ చెబుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నది వాస్తవమని అన్నారు. పులిచింతల ప్రాజెక్టు ఏ మేరకు పదిలం? అన్న విషయాన్ని నిగ్గు తేల్చడంతో పాటు లోపాలు ఎలా చక్కదిద్దాలన్న విషయాలపై అధ్యయనం చేయడానికి ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు.