సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మహిళను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్... వీడియో ఇదిగో!
- కదిలే రైలు ఎక్కేందుకు మహిళ ప్రయత్నం
- పట్టు దొరక్క జారిపడిన వైనం
- వేగంగా స్పందించిన కానిస్టేబుల్
- మహిళను బయటికి లాగడంతో తప్పిన ముప్పు
అంతలో అటుగా దినేశ్ సింగ్ అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వచ్చాడు. మహిళ జారిపడడాన్ని గుర్తించి వేగంగా స్పందించాడు. ఆమెను బలంగా బయటికి లాగాడు. దాంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. అటు, రైల్లో ఉన్న ప్రయాణికుడొకరు చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. ఓ మహిళ ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ దినేశ్ సింగ్ ను ప్రయాణికులు, రైల్వే అధికారులు అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పలువురిని ఆకట్టుకుంది. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ కూడా ఈ వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు.