ఫోన్ ట్యాపింగుల గురించి పట్టించుకోవాల్సిన పని లేదు: కుమారస్వామి
- దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్
- ఫోన్ ట్యాపింగులు 10 నుంచి 15 ఏళ్లుగా జరుగుతున్నాయి
- గతంలో ప్రభుత్వాలు, ఐటీ శాఖ ప్రజల ఫోన్లను ట్యాప్ చేసేవి
ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగులు గత 10 నుంచి 15 ఏళ్లుగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రజల ఫోన్లను గతంలో ప్రభుత్వాలు, ఆదాయపు పన్ను శాఖ ట్యాప్ చేసేవని చెప్పారు. మన దేశంలో ఏ ప్రభుత్వాలైనా, ఏ పార్టీలయినా, సమాచారం కోసమో లేదా వారి ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమో ఇలా చేస్తుంటాయని అన్నారు. ఇలాంటి అంశాలను సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.